MCA విడుదల తరువాత గొడవపడ్డ నాని, సాయి పల్లవి!

మొన్న రిలీజ్ అయిన ఎం.సి.ఏ సినిమా మంచి రివ్యూ మరియు రేటింగ్స్ తో మంచి ఓపెనింగ్స్ సంపాదించింది. పోటీలో మొన్న ఏ సినిమా లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్స్ ని నాని సినిమా సంపాదించింది. “నేను లోకల్” ని చాలా పెద్ద మార్జిన్ తో ఎం.సి.ఏ దాటడం ఖాయం. కానీ కంటెంట్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది ఎం.సి.ఏ సినిమా.

ఇలా కంటెంట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ మూవీ ఈ సోమవారం నుండి అసలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. రేసుగుర్రం లో అన్న, తమ్ముళ్ల మధ్య గాప్ ని ఈ సినిమాలో వదిన, మరది మధ్య పెట్టి సేమ్ స్టోరీ నడిపించినట్టు చాలా వార్తలు వస్త్తున్నాయి. ఇంకా సాయి పల్లవి ఫాన్స్ మాత్రం చాలా డిస్సాపోయింట్ అయ్యారు. ఒక రొటీన్ హీరోయిన్ తరహాలో ఆ పాత్రకి ఏ మాత్రం ప్రాధాన్యత మొక్కుబడిగా ఆ పాత్రను పెట్టినట్టు ఉంది అని సాయి పల్లవి ఫాన్స్ అంటున్నారు. తనకంటే సినిమాలో, భూమిక స్క్రీన్ మీద ఎక్కువసేపు కనిపించడం కూడా ఒక కారణం అయ్యివుండవచ్చు.

ఫిదా సినిమాలో భానుమతిగా సాయి పల్లవి ని చూసిన తరువాత, తనని ఆ మెట్టు కంటే కింద ఉహించుకోడానికి ఒప్పుకోవట్లేదు ప్రైక్షకులు. మరియు సాయి పల్లవి పాత్రకు ఇవ్వాల్సిన సీన్స్ లో చాలా సీన్స్ తగిచ్చారు. అది ఒక కారణం తో సాయి పల్లవి ఫాన్స్ అస్సలు ఒప్పుకోవట్లేదు. అందుకే తనకి, హీరోకి మరియు దర్శకుడికి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి అని వార్తలు కూడా వచ్చాయి. అందులో బలం చేకూర్చే విధంగా ఈ సినిమాలో సాయి పల్లవి చాలా ఆర్డినరీ గా ఉండటం వల్ల ఆ వార్తలు నిజమే అని అందరి అభిప్రాయం.

దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం క్రింద ఉన్న వీడియోని చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.

SHARE