పుట్టగానే ఐదు లక్షలు సంపాదించింది

డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత బెంగళూరు నగరంలో జన్మించే మొదటి ఆడపిల్లకు బెంగళూరు మేయర్‌ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలక పరిధిలోని ఆసుపత్రుల్లో జన్మించే ఆడపిల్లకు అక్షరాలా 5 లక్షల రూపాయలను బహుమతిగా ఇవ్వనున్నట్లు మేయర్‌ సంపత్‌రాజ్‌ గురువారం తెలిపారు.నూతన సంవత్సరం (2018) మొదటిరోజు ప్రారంభమైన ఐదు నిమిషాల్లో జన్మించిన ఆడశిశువుకు బీబీఎంపీ నుంచి రూ.5 లక్షల చెక్‌ను సోమవారం మేయర్‌ సంపత్‌రాజ్‌ అందజేశారు. రాజాజీనగర మొదటి స్టేజ్‌ నివాసి పుష్పకు ఆదివారం రాత్రి పురిటి నొప్పులు రాగా రాజాజీనగర డీ.నాగరాజ ప్రసూతి ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. కొత్త ఏడాది ఆరంభమైన ఐదు నిమిషాలకు (12.05) పుష్ప ఆడబిడ్డకు జన్మినిచ్చింది. ఈ సమాచారం అందుకున్న బీబీఎంపీ ప్రదాన ఆరోగ్యాధికారి డాక్టర్‌.నిర్మల్‌ బుగ్గి, ఆ విషయాన్ని మేయర్‌ సంపత్‌రాజ్‌కు తెలిపారు.కొత్త ఏడాది రోజున నగరంలోని పాలికె ప్రసూతి ఆస్పత్రిలో సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన మొట్టమొదటి ఆడశిశువుకు రూ. 5 లక్షల చెక్కును అందజేస్తామనిమేయర్‌ నాలుగు రోజుల క్రితం ప్రకటించడం తెలసిందే. ఆ మేరకు మేయర్‌ సంపత్‌రాజ్‌ సోమవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి బాలింత పుష్పకు చెక్‌ బహూకరించారు.తన కుమార్తె కు ఐదు లక్షలు చెక్‌ అందడం సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిన తల్లిదండ్రులు.. ఆ నగదుపై వచ్చే వడ్డీని బాలిక చదువుకు మాత్రమే వినియోగిస్తామని తెలిపారు.

SHARE