నవ్వు ఆయుష్షు పెంచటం మాట ఏమోగానీ మెక్సికోలో మాత్రం ఓ టీచర్‌ ప్రాణాలు తీసింది

నవ్వినా,ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని ఓ సినీగేయ రచయిత రాశారు. కాకపోతే ఈ సంఘటనలో ప్రాణమే పోయింది.నవ్వు ఆయుష్షు పెంచటం మాట ఏమోగానీ మెక్సికోలో మాత్రం ఓ టీచర్‌ ప్రాణాలు తీసింది. బిగ్గరగా నవ్వుతూనే పై అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది.షారోన్‌ రెగోలి సిఫోర్రోనో (50)  పెన్నిసైల్వేనియాలోని హుస్టన్‌ మిడిల్‌ స్కూల్‌లో టీచర్‌ గా పని చేస్తోంది. సమ్మర్‌ సెలవులు కావటంతో సోమవారం  తన కూతురితో ఓ స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ సరదాగా బాల్కనీలో ఓ బెంచ్‌ మీద కబుర్లు చెబుతూ గడిపింది.ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ బిగ్గరగా నవ్వటం ప్రారంభించిన ఆమె ఆ కుదుపులో వెనక్కి ఒరిగి,అదుపు తప్పి బాల్కనీ నుంచి కింద పడిపోయింది. తలకు తీవ్రగాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఆ సమయంలో ఆమె మద్యం సేవించి ఉన్నట్లు అనుమానించినా.. తర్వాత పరీక్షల్లో నిజం కాదని తేలింది. బాల్కనీకి రక్షణ చర్యలు లేకపోవటమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. వివాహిత అయిన రెగోలికి ఇద్దరు పిల్లలు. సెలవుల సందర్భంగా వచ్చిన తన స్నేహితురాలు ఈ విధంగా  మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని రెగోలి స్నేహితుడు కన్నీరు మున్నీరు అవుతున్నాడు.

SHARE