ఇది పిండి కాదు విషం,మైదా పిండి నిజస్వరూపం తెలిస్తే మళ్ళీ ఎప్పుడు తినరు:::

గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది.కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా.?మైదా పిండి ఎలా వస్తుంది,మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్ లో పలానాది తింటే చాలా బావుందని చెబుతుంటారు. అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో,ఒక్కసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది.మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది.మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది.అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు.కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ , బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు. మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది. ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి.  అవి ఇన్ఫక్షన్లను కలిగిస్తాయి.దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి,కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది.ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే. స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది. ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు.

SHARE